నిఫ్టీ... ఫ్యూచర్స్‌ సిగ్నల్స్‌

12 Sep, 2017 01:13 IST|Sakshi
నిఫ్టీ... ఫ్యూచర్స్‌ సిగ్నల్స్‌

ప్రపంచ ట్రెండ్‌ ప్రభావంతో ఇక్కడ మార్కెట్‌ ర్యాలీ జరపడంతో నిఫ్టీ ఆగస్టు 7 తర్వాత తొలిసారిగా 10,000 పాయింట్లపైన 10,006 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ సందర్భంగా నిఫ్టీ ఫ్యూచర్‌ కాంట్రాక్టు ఓపెన్‌ ఇంట్రస్ట్‌ (ఓఐ)లో 3.33 లక్షల షేర్లు యాడ్‌ అయ్యాయి. దీంతో మొత్తం ఓఐ 1.98 కోట్ల షేర్లకు పెరిగింది. నిఫ్టీ ఫ్యూచర్‌ 10,026 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ట్రేడింగ్‌రోజున ఫ్యూచర్‌ ప్రీమియం 15 పాయింట్లు వుండగా, సోమవారం అది 20 పాయింట్లకు పెరిగింది.

ఇండెక్స్‌ ర్యాలీ సందర్భంగా ప్రీమియం పెరిగిన కారణంగా ఫ్యూచర్లో యాడ్‌ అయిన పొజిషన్లలో అధికభాగం లాంగ్స్‌గా పరిగణించవచ్చు. ఆప్షన్స్‌ విభాగంలో 10,000 స్ట్రయిక్‌ వద్ద కాల్‌ కవరింగ్, పుట్‌ రైటింగ్‌ జరగడంతో కాల్‌ ఆప్షన్‌ నుంచి 8.45 లక్షల షేర్లు కట్‌కాగా, పుట్‌ ఆప్షన్లో 10.3 లక్షల షేర్లు యాడ్‌ అయ్యాయి. అయితే ఈ స్ట్రయిక్‌ స్థాయికి ఇండెక్స్‌ చేరడం ఐదు వారాల తర్వాత జరిగినందున, ఇక్కడ ఆప్షన్‌ బిల్డప్‌ ఇంకా తక్కువగానే వుంది.

38.89 లక్షల కాల్‌ బిల్డప్, 33.39 లక్షల పుట్‌ బిల్డప్‌ ఇక్కడ వుంది. 9,900 స్ట్రయిక్‌ వద్ద పుట్‌ రైటింగ్‌తో 4.22 లక్షల షేర్లు యాడ్‌కాగా, బిల్డప్‌ 56 లక్షలకు పెరిగింది. మరోవైపు 10,100, 10,200 స్ట్రయిక్స్‌ వద్ద కాల్‌ రైటింగ్‌ జరగడంతో 99 వేలు, 4.95 లక్షల చొప్పున షేర్లు యాడ్‌ అయ్యాయి. ఈ స్ట్రయిక్స్‌ వద్ద 36 లక్షల చొప్పున కాల్‌ బిల్డప్‌ జరిగింది. సమీప భవిష్యత్తులో నిఫ్టీ 10,000పైన స్థిరపడితే 10,100 స్థాయిని అధిగమించగలదని, అనూహ్య పరిణామాల కారణంగా క్షీణత సంభవిస్తే 9,900 సమీపంలో మద్దతు పొందవచ్చని ఈ ఆప్షన్‌ డేటా సూచిస్తున్నది. 

మరిన్ని వార్తలు