ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఇంధనం

21 Jan, 2016 03:23 IST|Sakshi

రామ్‌కీతో చేతులు కలిపిన వెంటానా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెత్త నుంచి ఇంధనాన్ని తయారు చేస్తున్న వెంటానా క్లీన్‌టెక్.. వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగంలో ఉన్న రామ్‌కీ ఎన్విరాన్‌మెంట్‌తో చేతులు కలిపింది. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కలిసి ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి పారిశ్రామిక అవసరాలకు వాడే ఇంధనాన్ని తయారు చేసే ప్లాంట్లను నెలకొల్పుతాయి. తొలి దశలో హైదరాబాద్‌లో రామ్‌కీ ఎన్విరోకు చెందిన ఇంటెగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కేంద్రంలో రోజుకు 15 టన్నుల సామర్థ్యం గల ప్లాంటును ఏర్పాటు చేయనున్నాయి.

రెండో దశలో ఇతర ప్రాంతాల్లో ఇటువంటి ప్లాంట్లను స్థాపిస్తామని వెంటానా సీఈవో అమిత్ టాండన్ తెలిపారు. హైదరాబాద్‌లో రామ్‌కీ రోజుకు 400లకుపైగా టన్నుల తక్కువ నాణ్యతగల ప్లాస్టిక్ చెత్త సేకరిస్తోంది. ఇరు సంస్థలకు మేలు చేకూర్చే ఒప్పందమిదని రామ్‌కీ ఎన్విరాన్‌మెంట్ ఎండీ గౌతమ్‌రెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు