చైనా భయం.. భారత్‌కు వరం

20 May, 2020 18:03 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న వేళ కొన్ని సానుకూల అంశాలు దేశానికి ఊపిరి పోస్తున్నాయి. తయారీ రంగంలో ప్రపంచానికి దిక్సూచీగా చైనా నిలిచిన విషయం తెలిసిందే. వూహాన్‌లో కరోనా ఉద్భవించిన నేపథ్యంలో చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక విదేశీ కంపెనీలు జంకుతున్నాయి. తాజాగా జర్మనీకి చెందిన షూ పరిశ్రమ చైనా నుంచి ఆగ్రాకు తరలిస్తున్నట్లు ప్రకటించింది. వాన్ వెల్క్స్ అనే షూ కంపెనీ రూ. 110కోట్ల ప్రారంభ పెట్టుబడితో చైనా నుంచి భారత్‌కు తరలిస్తున్నట్లు పేర్కొంది. ఆగ్రాలో లాట్రిక్స్‌ ఇండస్ట్రీస్‌ సహకారంతో తయారీని ప్రారంభిస్తామని పేర్కొంది.

చైనా తర్వాత అత్యధిక జనాభా కలిగిన భారత్‌ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనేక ప్రణాళికలు రచిస్తోంది. యూపీ ప్రభుత్వం మౌళిక సదుపాయాలను కల్సిస్తూ విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందని కంపెనీ ప్రతినిథులు ప్రశంసించారు. పెట్టుబడులను ఆకర్శించేందుకు ప్రభుత్వం చూపిస్తున్న చొరవ వల్ల కార్యాలయాలను చైనా నుంచి యూపీకి తరలించేందుకు పలు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని యూపీ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

చదవండి: భారత్‌ నుంచి 12 లక్షల కోట్లు వెనక్కి

మరిన్ని వార్తలు