రుయా ఘటనలో ముగ్గురు అరెస్ట్‌!

20 May, 2020 18:11 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతి రుయా హాస్పిటల్‌లో ప్రైవేట్‌ అంబులెన్స్‌ ఆగడాలపై పోలీసులు సీరియస్‌ అయ్యారు. రుయా ఆసుపత్రిలో కొంతమంది అంబులెన్స్‌ వాళ్లు వ్యవహరించిన తీరు దారణమని తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేష్‌ రెడ్డి పేర్కొన్నారు. రుయా ఆసుపత్రికి ఏ అంబులెన్స్ అయినా రావొచ్చు అని, అడ్డుకునే హక్కు ఎవరికి లేదని తెలిపారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. అంబెలెన్స్‌ డ్రైవర్లపై దాడికి పాల్పడ్డ యూనియన్‌ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రుయాలో బయటి అంబులెన్స్‌లకు అనుమతి ఉందన్న పోలీసులు ఎవరికైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయాలని కోరారు. (త్రీస్టార్.. తిరుపతి వన్)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు