చెన్నైలో గోగో టెక్నాలజీ కేంద్రం

26 Jan, 2018 00:56 IST|Sakshi

ముంబై: విమానాల్లోపల ఇంటర్నెట్, వినోద సర్వీసులు అందించే అంతర్జాతీయ సంస్థ గోగో తాజాగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. చెన్నైలో టెక్నాలజీ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరుకల్లా ఇది అందుబాటులోకి రాగలదని గోగో ఈవీపీ ఆనంద్‌ చారి ఒక ప్రకటనలో తెలిపారు.

30 మంది ఇంజనీర్స్, డెవలపర్స్‌తో ప్రారం భించి.. 2018 ఆఖరు నాటికి సిబ్బంది సంఖ్య ను సుమారు 100కి పెంచుకోనున్నట్లు వెల్లడించారు. భారత్‌లో టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేయడం.. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని కస్టమర్లకు సేవలు మెరుగుపర్చుకోవడానికి ఇది ఉపయోగపడగలదని చారి వివరించారు. దేశీ, విదేశీ రూట్లలోని విమానాల్లో కూడా ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులోకి తేవాలని టెలికం విభాగం యోచిస్తున్న నేపథ్యంలో దేశీ మార్కెట్లోకి గోగో ఎంట్రీ ప్రాధాన్యం సంతరించుకోనుంది.

మరిన్ని వార్తలు