జీఎస్‌టీ రిటర్నుల గడువు 22 వరకూ పొడిగింపు 

21 Feb, 2019 01:12 IST|Sakshi

న్యూఢిల్లీ: జనవరి నెలకు సంబంధించిన వస్తు, సేవల పన్నుల రిటర్న్స్‌ (జీఎస్‌టీఆర్‌–3బీ) దాఖలు చేసేందుకు గడువును జీఎస్‌టీ కౌన్సిల్‌ రెండు రోజుల పాటు పొడిగించింది. ఫిబ్రవరి 22 దాకా డెడ్‌లైన్‌ను పెంచింది. బుధవారం వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా జరిగిన 33వ సమావేశంలో జీఎస్‌టీ కౌన్సిల్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విపక్షాల పాలనలో ఉన్న కొన్ని రాష్ట్రాల డిమాండ్‌ మేరకు రియల్‌ ఎస్టేట్, లాటరీలపై పన్ను రేట్ల క్రమబద్ధీకరణ అంశంపై తుది నిర్ణయాన్ని ఫిబ్రవరి 24కి (ఆదివారం) వాయిదా వేసింది.

ప్రతీ గంటకి వేల కొద్దీ రిటర్నులు దాఖలవుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు సరిగ్గా లేనందున డెడ్‌లైన్‌ను రెండు రోజులు పొడిగించాలన్న సూచన మేరకు జీఎస్‌టీ కౌన్సిల్‌ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. జమ్మూ, కశ్మీర్‌కి గడువు ఫిబ్రవరి 28 దాకా పెంచినట్లు తెలియజేశారు. 
 

GST Council extends returns filing deadline, no decision yet on realty

>
మరిన్ని వార్తలు