నేటి నుంచి బెంగళూరులో ఇండియా ఉడ్ 2016

25 Feb, 2016 01:03 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:   దేశీయ అతిపెద్ద ఉడ్ వర్క్ ఎగ్జిబిషన్‌కు బెంగళూరు వేదికయ్యింది. ‘ఇండియా వుడ్ 2016’ పేరుతో ఫిబ్రవరి 25 నుంచి 29 వరకు జరిగే  ఈ ఎగ్జిబిషన్‌లో చెక్కతో చేసే ఫర్నిచర్, ఇతర గృహోపకరణాల తయారీలో వచ్చిన అత్యాధునిక టెక్నాలజీలను ప్రదర్శించనున్నారు. దేశీయ కంపెనీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల నుంచి వివిధ సంస్థలు రూపొందించిన ఫర్నిచర్, యంత్రాలను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలో సుమారు 700కు పైగా కంపెనీలు పాల్గొంటు న్నాయి. అత్యధికం తెలుగురాష్ట్రాలవే కావడం గమనార్హం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు