జియో దెబ్బకు ఎయిర్‌టెల్‌ కూడా..

8 Jan, 2018 13:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో తన ప్లాన్లను అలా సమీక్షించిందో లేదా దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ కూడా తన రీచార్జ్‌ ప్లాన్లను  రివ్యూ చేసింది.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్ల చెల్లుబాటును పొడిగిస్తూ అప్‌డేట్‌ చేసింది. తద్వారా ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తోంది.   రూ. 448, రూ.509 ప్రీపెయిడ్‌ రీచార్జ్‌లపై ఈ అదనపు  ప్రయోజనాలను  వెల్లడించింది.


తాజా నిర్ణయం ప్రకారం  రూ.448 ప్లాన్‌  వాలిడిటీని  70 రోజుల నుంచి 82 రోజులకు పెరిగింది.  రూ. 509 ప్రణాళిక  84 రోజుల బదులుగా ఇకపై 91 రోజులు పాటు  చెల్లుతుంది. ఈ  మార్పులు అన్ని ప్రీపెయిడ్ ఎయిర్టెల్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, వింక్‌మ్యూజిక్ ,  ఎయిర్టెల్ టీవీ   ఆప్‌ చందా వంటి ఇతర ప్రయోజనాలు ఈ పథకంలోనే  లభిస్తాయి.

మరిన్ని వార్తలు