తరలి వచ్చిన అంబానీ కుటుంబం

28 Nov, 2019 19:03 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర  ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే (59) ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఎట్టకేలకు  కొలువు దీరినట్టయింది. ముంబై శివాజీ  పార్క్‌లో గురువారం సాయంత్రం అట్టహాసంగా  నిర్వహించిన ఈ కార్యక్రమానికి  రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన అతిరధ మహారధులు హాజరయ్యారు. ముఖ్యంగా  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుటుంబం ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంబానీతోపాటు ఆయన భార్య నీతా అంబానీ, కుమారుడు అనంత్‌ ఈ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఉద్ధవ్‌కు అభినందనలు తెలిపారు. వీరితోపాటు ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో పాటు సుప్రియా సూలే, రాజ్‌ఠాక్రే, సుశిల్‌ కుమార్‌ షిండే, ఎంకే స్టాలిన్‌ తదితర ప్రముఖులు  పాల్గొన్నారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సుమారు నెల రోజుల తరువాత అనేక అనూహ్య పరిణామాల మధ్య చివరికి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో మహా వికాస్‌ అఘాడి కూటమి ఆధ్వర్యంలో సర్కార్‌ కొలువు దీరింది. 

 చదవండి : మహా పీఠంపై శివ సైనికుడు.. సీఎంగా ఠాక్రే ప్రమాణం

మరిన్ని వార్తలు