నష్టాల్లో మొదలై... వెంటనే లాభాల్లోకి...

4 Jun, 2020 09:29 IST|Sakshi

10100 సమీపంలో ట్రేడ్‌ అవుతున్న నిఫ్టీ

100 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్‌ 

కొనసాగుతున్న బ్యాంకింగ్‌, పైనాన్స్‌ షేర్ల ర్యాలీ 

దేశీయ మార్కెట్‌ గురువారం స్వల్పనష్టాల్లో మొదలై... వెంటనే లాభాల్లోకి మళ్లింది. ఉదయం గం.9:20ని.లకు  సెన్సెక్స్‌ 125 పాయింట్లు లాభంతో 34235 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 10085 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మన మార్కెట్‌ ప్రారంభ సమయానికి ఆసియా మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐల కొనుగోళ్లు క్రమంగా పెరుగుతుండటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరించింది. ఒక్క రియల్టీ తప్ప మిగిలిన అన్ని రంగా‍ల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫార్మా, బ్యాంకింగ్‌, పైనాన్స్‌ రంగాలకు చెందిన షేర్లు ర్యాలీ కొనసాగిస్తున్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 21వేలపైన 21067 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

నేడు వీక్లీ ఎక్స్‌పైరీ ఉండటంతో నేటి ట్రేడింగ్‌లో కొంత ఒడిదుడుకుల ట్రేడింగ్‌ ఉండచ్చు. డీఎల్‌ఎఫ్‌, పీఐ ఇండస్ట్రీస్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌ కంపెనీలతో పాటు మరో 15కంపెనీలు తన ఆర్థిక సంవత్సరపు మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనుండంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. సూచీలు 6రోజుల వరుసగా ర్యాలీ నేపథ్యంలో కొంత లాభాల స్వీకరణ జరగవచ్చని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు. అలాగే కరోనా వైరస్‌- సంబంధిత వార్తలు, రూపాయి ట్రేడింగ్‌, అంతర్జాతీయ క్రూడాయిల్‌ ధరలు సూచీల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

పాజిటివ్‌గా అంతర్జాతీయ మార్కెట్లు
మన మార్కెట్‌ నష్టాలో ప్రారంభమైనప్పటికీ.., అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపులతో ఆర్థిక వ్యవస్థ రికవరీ ఆశలు, పలు ప్రభుత్వాలు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. చైనా, సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌, జపాన్‌ దేశాలకు మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. తైవాన్‌, కొరియా, థాయిలాండ్‌, ఇండోనేషియా మార్కెట్లు స్వల్ప లాభాల్లో కదులుతున్నాయి. ఇక నిన్నరాత్రి విస్తృతస్థాయిలో కొనుగోళ్లు జరగడంతో అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 

  టాటామోటర్స్‌, టె‍క్‌ మహీంద్రా, గెయిల్‌, జీ లిమిటెడ్‌, యూపీఎల్‌ షేర్లు 2శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, ఐఓసీ, ఇన్రా‍్ఫటెల్‌, కోటక్‌ బ్యాంక్‌, టైటాన్‌ షేరు​1శాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి.

మరిన్ని వార్తలు