ఆర్‌బీఐ సంచలన నిర్ణయం

13 Mar, 2018 19:05 IST|Sakshi

సాక్షి, ముంబై: పీఎన్‌బీ స్కాం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.  ఎల్‌వోయూ, లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌లను లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆథరైజ్డ్ డీలర్లకు  అన్ని బ్యాంకుల లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్స్, లెటర్ ఆఫ్ కంఫర్ట్‌ను రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.

భారతదేశంలోకి దిగుమతులకుద్దేశించిన వాణిజ్య రుణాలకోసం ఎల్‌వోయూ (స్వల్పకాలిక క్రెడిట్ రూపంలో బ్యాంకు మరొక ఇండియన్ బ్యాంకు విదేశీ బ్రాంచి నుంచి  రుణం పొందానికి తన కస్టమర్‌ను అనుమతించే పత్రమే లెటర్‌ ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌..ఎల్‌వోయూ) జారీ  ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. తక్షణమే తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఆర్‌బీఐ జారీ చేసిన ఒక  సర్క్యులర్‌లో ప్రకటించింది.   అయితే  జూలై 1, 2015 నాటి బ్యాంకింగ్‌ నిబంధనలను లోబడి లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ జారీ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ కీలక నిర‍్ణయంతో దిగుమతి దారులకు భారీ షాక్‌ ​ ఇచ్చింది.   దీనిపై పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఎల్‌వోయూ, ఎల్‌వోసీ రూపంలో బ్యాంక్‌ గ్యారంటీలు పొందే  దిగుమతుదారులను భారీగా ప్రభావితం చేయనుందని వాదించాయి. 

>
మరిన్ని వార్తలు