బైక్ రైడర్ల కోసం..శాంసంగ్ జే3 స్మార్ట్ ఫోన్

1 Apr, 2016 21:31 IST|Sakshi
బైక్ రైడర్ల కోసం..శాంసంగ్ జే3 స్మార్ట్ ఫోన్

ధర రూ.8,990

 న్యూఢిల్లీ: కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్... తాజాగా తన ‘జే సిరీస్’లో కొత్త స్మార్ట్‌ఫోన్ ‘గ్యాలక్సీ జే3’ను గురువారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల స్క్రీన్, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4జీ, 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎస్-బైక్ మోడ్ వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

 ఎస్-బైక్ మోడ్ ప్రయోజనం: స్మార్ట్‌ఫోన్‌ను ఈ మోడ్‌లో ఉంచి బైక్ నడుపుతున్నప్పుడు మనకు ఏదైనా కాల్ వస్తే.. మన స్మార్ట్‌ఫోన్ ఆటోమెటిక్‌గానే కాల్ చేసిన వారికి ‘తర్వాత కాల్ చేయండి’ అనే సందేశాన్ని పంపిస్తుంది. దీంతో రైడర్లు మాటిమాటికీఫోన్‌చూసుకోకుండా డ్రైవింగ్‌పైనే దృష్టి పెట్టొచ్చు. అదే ఎమర్జెన్సీ అయితే కాల్ చేసిన వారు వారి స్మార్ట్‌ఫోన్‌లో 1 ప్రెస్ చేస్తే.. ‘అర్జెంట్ కాల్’ అని డ్రైవింగ్ చేస్తున్న వారి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. ఈ మోడ్‌లో డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం కుదరదు.

మరిన్ని వార్తలు