భారీ ఊగిసలాట, చివరికి లాభాలు

6 May, 2020 15:45 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి లాభాల్లో ముగిసాయి. కీలక సూచీలు  రోజంతా  లాభనష్టాల మధ్య ఊగిస లాడాయి. ఆరంభంలో పాజిటివ్ గా ఉన్న సెన్సెక్స్ వెంటనే నష్టాల్లోకి  జారుకుంది.   ఆ తరువాత కొనుగోళ్లతో  పుంజుకుని ఒక దశలో దాదాపు 500 పాయింట్లు ఎగిసింది. ఈ లాభాలనుంచి వెనక్కి తగ్గి, చివరి గంటలో మళ్లీ ఊపందుకుంది.  సెన్సెక్స్ 232 పాయింట్ల లాభంతో 31685 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు ఎగిసి 9270 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 9250 స్థాయిని నిలబెట్టుకుంది.  ముఖ్యంగా   బ్యాంకింగ్, ఫైనాన్షియల్  షేర్ల లాభాలు మార్కెట్ కు భారీ ఊతమిచ్చాయి. (పెట్రో షాక్, నష్టాల్లో మార్కెట్లు )

బజాజ్ ఫిన్ సర్వ్, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్ సీ, గెయిల్, భారతి ఎయిర్టెల్, హీరో, మెఓటో, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ భారీగా లాభపడగా, ఐటీసీ,  భారతి ఇన్ ఫ్రాటెల్, కోల్ ఇండియా, ఐవోసీ, టీసీఎస్,  యూపీఎల్, హెచ్ యూఎల్, యాక్సిస్ ఇన్ఫోసిస్, సిప్లా టాప్ లూజర్స్ గా ఉన్నాయి.  అటు డాలరు మారకంలో రూపాయి  బుధవారం బలహీపడింది.17 పైసలు క్షీణించి 75.80 వద్ద ట్రేడ్ అయింది.చివరికి 75.76 వద్దస్థిరపడింది.  డాలరుతో పోలిస్తే రూపాయి మంగళవారం  75.63  వద్ద ముగిసింది.  

చదవండి : పెట్రో వాత : అక్కడ పెట్రోలు ధర రూ. 2 పెంపు

>
మరిన్ని వార్తలు