ఆగని మార్కెట్ల పతనం

9 May, 2019 14:20 IST|Sakshi

సాక్షి, ముంబై: అంతర్జాతీయంగా వాణిజ్య వివాదాలు,  దేశీయంగా ఎన్నికల ఫలితాలపై ఆందోళనలు దేశీ స్టాక్‌ మార్కెట్లను గత వారంరోజులుగా పట్టి పీడిస్తున్నాయి.  ఇన్వెస్టర్లు అమ్మకాలతో రుసగా ఏడో రోజు మార్కెట్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 303 పాయింట్లు క్షీణించి 37, 491 స్థాయికి పడిపోగా, నిఫ్టీ 85 పాయింట్ల వెనకడుగుతో 11,274  వద్ద ట్రేడవుతోంది. దీంతోనిఫ్టీ 11300 స్థాయిని కూడా  బ్రేక్‌ చేసింది.

ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపగల చైనా, అమెరికా మధ్య వాణిజ్య వివాదాలు కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ రెండు దేశాల మధ్య డీల్‌ కుదిరే అంశంపై అనుమానాలతో ఆసియా మార్కెట్లు బలహీనపర్చింది.

ప్రధానంగా ఫార్మా, మెటల్‌ ఐటీ  భారీగా నష్టపోతుండగా, మీడియా 3 శాతం ఎగసింది.  గత కొన్ని  రోజులుగా బలహీనపడుతున్న మీడియా కౌంటర్లలో జీ ఎంటర్‌టైన్‌, డిష్‌ టీవీ, జీ మీడియా 7-5 శాతం మధ్య జంప్‌చేయగా.. టీవీ టుడే, సన్‌టీవీ, హాథవే, పీవీఆర్‌, డెన్‌ 3-1 శాతం మధ్య ఎగశాయి.  ఇంకా ఆర్‌ఐఎల్‌, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, అదానీ పోర్ట్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ ఫార్మా, పవర్‌గ్రిడ్‌  టాప్‌ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.  యస్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్, హీరో మోటో, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్ ఫిన్‌, బ్రిటానియా, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఆటో  లాభపడుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు