రికార్డుల మోత, ఫ్లాట్‌గా సూచీలు

16 Dec, 2019 10:38 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లలో ఆరంభంలోనే  రికార్డుల హోరెత్తింది.  అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో సెన్సెక్స్‌ సోమవారం ప్రారంభంలోనే 159 పాయింట్లు జంప్‌చేసి 41,168 పాయింట్ల వద్ద కొత్త రికార్డును సృష్టించింది. నిఫ్టీ కూడా  48 పాయింట్ల  లాభంతో 12,138  వద్ద  కొత్త ఆల్‌  టైం రికార్డు 20 పాయింట్ల దూరంలో నిలిచింది. అటు బ్యాంకు నిఫ్టీ కూడా 32 వేల వద్ద కొత్త రికార్డు స్థాయిని అధిగమించింది. కానీ కొత్త గరిష్టాలను తాకిన వెంటనే సూచీలు రెండూ  వెనక్కి తగ్గాయి. స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా మారాయి.  సెన్సెక్స్‌ 4, నిప్టీ 5 పాయింట్ల బలహీనంగా కొనసాగుతోంది. బ్యాంకులు, ఐటీ లాభపడుతోంది. టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌,కోటక్‌మహీంద్ర, ఇండస్‌ ఇండ్‌, పవర్‌ గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌ లాభపడుతుండగా అదానీ పోర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌,ఐవోసీ, ఐటీసీ, టాటా మోటార్స్‌, సన్‌ఫార్మ, హెచ్‌యూఎల్‌, గ్రాసిం, కోల్‌ ఇండియా నష్టపోతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 8 పైసలు  లాభపడింది. 

మరిన్ని వార్తలు