ట్రిపుల్‌ సెంచరీ లాభాలతో జోరుగా మార్కెట్లు

24 May, 2018 14:03 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో ఆరంభ లాభాలనుంచి మరింత పుంజుకున్న మార్కెట్లు ట్రిపుల్‌  సెంచరీ లాభాలను సాధించాయి.    సెన్సెక్స్‌ 330 పాయింట్లు  ఎగిసి 34,650 స్థాయిని అధిగమించగా, నిఫ్టీ 60 పాయింట్లకు పైగా ఎగిసింది.  ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా   లాభాలు మార్కెట్లను లీడ్‌ చేస్తున్నాయి.  కాగా ఆటో, రియల్టీ  నష్టపోతున్నాయి.

ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా, టీసీఎస్‌, ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐవోసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్ఎం లాభాల్లో కొనసాగుతున్నాయి.  టాటా మోటార్స్‌  టాప్‌ లూజర్‌గా ఉండగా ఓఎన్‌జీసీ, గ్రాసిమ్‌, వేదాంతా, హెచ్‌పీసీఎల్‌, ఐబీ హౌసింగ్‌, బీపీసీఎల్‌, అల్ట్రాటెక్‌, బజాజ్‌ ఆటో, గెయిల్‌  తదితర షేర్లు నష్టపోతున్న వాటిల్లో ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు