లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

7 May, 2018 09:50 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ తన 35వేల కీలకమార్కుకు పునరుద్ధరించుకుంది. ప్రారంభంలోనే 100 పాయింట్లు జంప్‌ చేసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 125 పాయింట్ల లాభంలో 35,040 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 31 పాయింట్ల లాభంలో 10,650 మార్కుకు పైన 10,648 వద్ద కొనసాగుతోంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో టాప్‌ గెయినర్లుగా భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంకు, హిందాల్కో, మహింద్రా అండ్‌ మహింద్రాలు ఉండగా.. విప్రో, ఎన్‌టీపీసీ, లుపిన్‌, హెచ్‌పీసీఎల్‌లు లూజర్లుగా ఉన్నాయి.

ఇన్ఫోసిస్‌ 1 శాతానికి పైగా లాభాలు పండించింది. అంబుజా సిమెంట్స్‌ టార్గెట్‌ ధరను క్రెడిట్‌ సూసీ తగ్గించడంతో, ఉదయం ట్రేడ్‌లో ఈ కంపెనీ షేర్లు కిందకి పడిపోతున్నాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా బాగా క్షీణిస్తోంది. 20 పైసలు క్షీణించిన రూపాయి 2017 ఫిబ్రవరి నాటి కనిష్ట స్థాయిలకు పడిపోయింది.

>
మరిన్ని వార్తలు