టాటా కంపెనీలపై మిస్త్రీ ఆరోపణలు... ఐసీఏఐ దృష్టి

15 Feb, 2017 01:37 IST|Sakshi
టాటా కంపెనీలపై మిస్త్రీ ఆరోపణలు... ఐసీఏఐ దృష్టి

న్యూఢిల్లీ: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) తాజాగా టాటా గ్రూప్‌ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై దృష్టి సారించింది. పలు టాటా గ్రూప్‌ కంపెనీల్లో అకౌంటింగ్‌ సంబంధిత అంశాల్లో అవకతవకలు జరిగాయని మిస్త్రీ లేవనెత్తిన ఆరోపణలను పరిశీలిస్తున్నామని ఐసీఏఐ తెలిపింది. దీనితోపాటు యునైటెడ్‌ స్పిరిట్స్‌కు సంబంధించిన అకౌంటింగ్‌ అంశాలను కూడా క్షుణ్ణంగా శోధిస్తున్నామని పేర్కొంది.

వెలువడిన ఆరోపణలపై దృష్టి కేంద్రీకరించాలని ఇప్పటికే తాము ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ రివ్యూ బోర్డు (ఎఫ్‌ఆర్‌ఆర్‌బీ)ని కోరామని ఐసీఏఐకు కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్‌ నీలేశ్‌ ఎస్‌ వికాంసే తెలిపారు. కాగా టాటా సన్స్‌ చైర్మన్‌గా మిస్త్రీని తొలగించిన తర్వాత ఆయన టాటా గ్రూప్‌కు చెందిన కొన్ని కంపెనీల్లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సమస్యలను లేవనెత్తుతూ, పలు ఇతర అంశాల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ బోర్డుతోపాటు సెబీతో సహా ఇతర నియంత్రణ సంస్థలకు లేఖలు రాశారు. 

మరిన్ని వార్తలు