ఏడాదిన్నరలో రూ 50,000 కోట్ల పన్ను ఎగవేత..

19 Nov, 2018 11:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాదిన్నరలో దేశవ్యాప్తంగా రూ 50,000 కోట్ల మేర పన్ను ఎగవేతలను కేంద్ర పరోక్ష పన్నుల విభాగం (సీబీఐసీ) గుర్తించింది. మొత్తం పన్ను ఎగవేతలో పది శాతం వరకూ జీఎస్టీ వసూళ్లున్నాయని పేర్కొంది. జులై 2017-18 మధ్య నమోదైన 604 కేసుల్లో రూ 4441 కోట్ల జీఎస్టీ ఎగవేతను అధికారులు కనుగొన్నారని సీబీఐసీ పర్యవేక్షణలో పనిచేసే జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీజీఐ) డేటా వెల్లడించింది.

ఇక పన్ను ఎగవేతల్లో రూ 39,047 కోట్లు సర్వీస్‌ ట్యాక్స్‌ ఎగవేతలు కాగా, రూ 6,621 కోట్ల సెంట్రల్‌ ఎక్సైజ్‌ ఎగవేతలున్నాయని సీబీఐసీ గుర్తించింది. జీఎస్టీ అమలుకాక ముందు పన్ను ఎగవేతలు అధికంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జీఎస్టీ హయాంలో పన్ను వసూళ్ల రేటు పుంజుకుందని, గుర్తిం‍చిన పన్ను ఎగవేతల్లో 57 శాతం రికవరీ రేటు సాధించామని పేర్కొన్నారు. ఈ ఏడాది నమోదైన పాత కేసుల్లో రికవరీ కేవలం 9 శాతంగానే ఉందని చెప్పారు.

మరిన్ని వార్తలు