ఎంఐ సేల్‌ : డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు

27 May, 2019 16:44 IST|Sakshi

అమెజాన్‌లో  ఎంఐ డేస్‌ సేల్‌

 భారీ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్‌

 ఎంఐ టీవీలపై  కూడా ఆఫర్లు

సాక్షి, ముంబై:  అమెజాన్‌ ఇండియాలో షావోమి, ఎంఐ 4 సిరీస్‌ టీవీలు స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.  ఈ  రోజు ( 26 సోమవారం)  ప్రారంభమైన ఈ సేల్‌ మే 31వ తేదీవరకు   అందుబాటులో ఉంటుంది.   షావోమి  రెడ్‌మి 6ఏ,  రెడ్‌మి 6 ప్రి, రెడ్‌మి వై2, రెడ్‌మి 6, రెడ్‌మి 7  తదితర స్మార్ట్‌ఫోన్లతో పాటు ఎంఐ టీవీలు  కూడా  రాయితీ ధరల్లో లభించనున్నాయి. 

ముఖ్యంగా 10వేల 15వేల  రూపాయల మధ్య లభించనున్న స్మార్ట్‌ఫోన్లపై  డిస్కౌంట్‌  ఆఫర్‌ లభిస్తుంది. అలాగే అమెజాన్‌ క్యాష్‌బ్యాక్‌, ఎక్స్చేంజ్,  తాత్కాలిక తగ్గింపులాంటి పొందవచ్చు. ఈఎంఐ ఆప్షన్‌ కూడా ఉంది.  ఎంఐ టీవీ 4 సిరీస్ టీవీలపై ఎక్స్చేంజ్, ఆఫర్‌ అందిస్తోంది.  49,  55, 43 అంగుళాల,  ఎంఐ ఆండ్రాయిడ్ టీవీ, ఎల్‌ఈడీ 4ఏ టీవీపై   రూ.2260  దాకా ఎక్స్చేంజ్ ఆఫర్‌ ఉంది.
 

>
మరిన్ని వార్తలు