జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద కారు బీభత్సం

2 Jul, 2019 08:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద సోమవారం అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి కారును వేగంగా నడుపుతూ.. సిగ్నల్‌ వద్ద యూటర్న్‌ తీసుకోవడానికి ప్రయత్నించడంతో.. వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్‌ సహయంతో కారును తొలగించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా