వీధి యుద్ధాలకు దిగితే కఠిన శిక్షలు

11 Jun, 2020 14:45 IST|Sakshi

సాక్షి, అమరావతి : వీధి యుద్ధాలకు దిగితే కఠిన శిక్షలు తప్పవని డీసీపీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. గ్యాంగ్ వార్ కేసులో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని, త్వరలోనే కేసును పూర్తిస్థాయిలో ఛేదించి నిందితులపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామన్నారు. నేర ప్రవృత్తి ఎక్కువగా ఉన్నవారిపై నగర బహిష్కరణ వేటువేస్తామని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పండు గ్యాంగ్లో ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్ చేశాము. సందీప్ టీంలో 15 మందిని రిమాండుకు పంపాము. రెండు గ్యాంగుల్లోని సభ్యులతో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేశాము. మరో 15 మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఆరు ప్రత్యేక బృందాలు నిందితులకోసం గాలిస్తున్నాయి. ( బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసు.. మరో ముందడుగు )

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్యాంగ్ లీడర్ పండు డిశ్చార్జ్ అవగానే అదుపులోకి తీసుకొంటాము. కుమారుడి నేర ప్రవృత్తిని ప్రోత్సహించిన పండు తల్లిపైనా కేసు నమోదు చేశాము. పండు, సందీప్‌ల కాల్ డేటా కూడా సేకరించాము గొడవ జరిగే ముందు ఇద్దరూ పదిసార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. పండునుంచి సందీప్‌కు ఆరు కాల్స్, సందీప్ నుంచి పండుకి నాలుగు కాల్స్ వెళ్లాయి. వివాదానికి కారణమైన ల్యాండ్ ఓనర్స్ శ్రీధర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డిలతో పాటు డీల్ మాట్లాడిన నాగబాబునూ విచారిస్తున్నాం’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు