వీడియో కాల్‌లో శవాలను చూపించి..

4 Dec, 2019 11:01 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న భవనం

ఘజియాబాద్‌: ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని కష్టాల సుడిలోకి నెట్టాయి. కన్నతండ్రి తన పిల్లలను చంపేందుకు కారణమయ్యాయి. ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో కలకలం సృష్టించిన కుటుంబం ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు తేల్చారు.

ఐదేళ్లుగా నష్టాలే..
గుల్షన్‌ వాసుదేవ ఉత్తర ఢిల్లీలోని గాంధీనగర్‌లో గార్మెంట్‌ బిజినెస్‌ నడిపిస్తున్నాడు. గత ఐదేళ్లుగా వ్యాపారంలో నష్టాలను చవిచూస్తున్నాడు. దీంతో అతడికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. కుటుంబ పోషణ కూడా భారం కాసాగింది. ఈ క్రమంలో గుల్షన్‌ తన కారుకు ఈఎమ్‌ఐ కూడా కట్టలేని నిస్సహాయస్థితికి చేరుకున్నాడు. పరిస్థితి ఇలానే కొనసాగితే కుటుంబం అంతా కలిసి చనిపోవడం తప్ప మరోదారి లేదంటూ చిన్ననాటి స్నేహితుడైన అరోరాతో తన గోడు వెల్లబోసుకునేవాడు.

తెల్లవారుజామున స్నేహితుడికి మెసేజ్‌..
గుల్షర్‌ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మిత్రుడు అరోరాకు టెక్స్ట్‌ మెసేజ్‌ చేశాడు. అనంతరం కాసేపటికి వీడియో కాల్‌ చేసి మాట్లాడాడు. శాశ్వతంగా నిద్రపుచ్చిన తన పిల్లలను, గోడపై రాసిన సూసైడ్‌ నోట్‌ను చూపించాడు. అందులో వారి చావుకు రాకేశ్‌ వర్మ కారణమంటూ గోడపై రాతలు కనిపించాయి. అతను ఇచ్చిన బౌన్స్‌ అయిన చెక్కులు కూడా అక్కడ ఉన్నాయి. కాగా గుల్షన్‌ అతని బంధువు రాకేశ్‌ వర్మకు రూ.2 కోట్లు అ‍ప్పుగా ఇచ్చాడు. కానీ అతను ఇచ్చిన చెక్‌లు బౌన్స్‌ అయ్యాయి. ఆ తర్వాత అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేయలేకపోయాడు. దీంతో 2015లో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు కూడా నమోదు చేశారు.

కుటుంబం ఆత్మహత్య
ఏదారి కనిపించక మరణమే శరణ్యమని భావించిన గుల్షన్‌ పిల్లలను చంపేసి, భార్యతో కలిసి ఎనిమిదో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్లతో పాటు అతని ఆఫీసు ఉద్యోగి సంజన కూడా ఆత్మహత్యకు యత్నించటం విచారకరం. ఆత్మహత్యకు యత్నించి తీవ్రగాయాలపాలై చికిత్స తీసుకుంటున్న సంజనను ముందుగా గుల్షన్‌ రెండో భార్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ, విచారణలో ఆమెను ఫ్యాక‍్టరీలో పనిచేసే ఉద్యోగిగా తేల్చారు. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: ఘజియాబాద్‌లో కుటుంబం ఆత్మహత్య)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రిజర్వాయర్‌లో యువతి మృతదేహం

భర్త వేధింపుల వల్లనే ఆత్మహత్య

మహిళా టెకీ అనుమానాస్పద మృతి

నన్ను పెళ్లి చేసుకోకపోతే ఫలితం అనుభవిస్తావ్‌

మున్సిపల్‌ ఉద్యోగులమంటూ.. నగలు, నగదు కొట్టేశారు

పసుపు..కారం..కాదేదీ కల్తీకనర్హం!

మద్యం మత్తులో మహిళపై హత్యాచారం

బీటెక్‌ చదివి ఖాళీగా తిరిగితే ఎలా? అనడంతో ఆత్మహత్య

మందలించడమే శాపమైంది!

టీవీ నటితో అక్రమ సంబంధం..

గోడపై రక్తంతో మరణ వాంగ్మూలం..

స్నేహితుడితో కలిసి భార్యపై లైంగికదాడి

నాన్నా.. నీ కష్టాన్ని చూడలేను ఇక వెళ్లొస్తా!

తల్లీబిడ్డ దారుణ హత్య

యువతి దుస్తులు చింపి.. 

‘దిశ’పై అనుచిత పోస్టులు.. వ్యక్తి అరెస్టు

దిశ ఘటన మరవకముందే..బిహార్‌లో..!!

వావివరసలు మరిచి.. పశువులా మారి!

పరిగిలో ఘరానా మోసం

సూట్‌కేసులో డెడ్‌బాడీ.. ముక్కలు ముక్కలుగా నరికి..

ఫేస్‌బుక్‌లో దిశపై అసభ్య ప్రచారం

ఏమైందో..ఏమో..! 

ముఖంపై ముసుగు వేసి.. ఊపిరాడకుండా చేసి

కడపలో దారుణ హత్య

యూపీలో పైశాచికం : వృద్ధురాలిపై లైంగిక దాడి

రూపాయి కోసం ముష్టియుద్ధం

బాలుడి కిడ్నాప్‌ కలకలం 

కుటుంబం ఆత్మహత్య.. ఆస్పత్రిలో రెండో భార్య!

ప్రభుత్వ క్వార్టర్‌లోనే యువతిపై ఖాకీచకం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రజనీ సినిమాలో వారిద్దరూ!

10 రోజులు ముందే పుట్టిన రోజు వేడుకలు

రాహుల్‌కు సినిమా చాన్స్‌

చూసీ చూడంగానే నచ్చుతుంది

తిట్టేవారు కూడా కావాలి

నా పేరు జగదీష్‌..కానీ అందరూ