హోంవర్క్‌ అడిగిన టీచర్‌పై దారుణం

9 Jul, 2019 10:45 IST|Sakshi

చండీగడ్‌ : హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. హోంవర్క్‌ చూపించమన్నందుకు టీచర్‌పై పదకొండో తరగతి విద్యార్థి కత్తితో దాడికి పాల్పడ్డాడు. గాయాలపాలైన టీచర్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు... హర్యానాలోని సోనాపేట్‌ గ్రామంలో శ్రీరామ్‌ కృష్ణ అనే స్కూల్‌లో ముఖేష్‌ కుమారి ఇంగ్లీష్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు.  వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో హలీడే హోంవర్క్‌ చూపించమని విద్యార్థులను అడిగారు. ఒక్కో విద్యార్థి దగ్గరికి వెళ్లి చెక్‌చేయడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలో టీచర్‌ తన వద్దకు రాగానే ఓ విద్యార్థి అకస్మాత్తుగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. నాలుగుసార్లు పొడిచి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే కుమారి అరుపులు విన్న మరో టీచర్‌ సదరు విద్యార్థిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమారి మాట్లాడుతూ..‘ హోం వర్క్‌ చూపించమన్నాను అంతే. తన బ్యాగులో ఉన్న కత్తి తీసి నన్ను పొడిచేశాడు. తను ఎప్పుడూ హోంవర్క్‌ చేసేవాడు కాదు. కానీ ఇంత పనిచేస్తాడనుకోలేదు’ అని భయానక అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డ్రైవర్‌ నిద్రమత్తు.. 9 మంది దుర్మరణం..!

విద్యార్థినులపై పెరుగుతున్న అకృత్యాలు..!

మద్యం మత్తులో తాళం పగులగొట్టి ఆత్మహత్య

పని చేస్తున్న సంస్థకే కన్నం

మృత్యువులోనూ వీడని బంధం

మాటలు కలిపాడు..మట్టుపెట్టాడు

కులం పేరుతో దూషించినందుకు ఐదేళ్ల జైలు

పని చేస్తున్నసంస్థకే కన్నం

నీళ్లనుకుని లైజాల్‌ తాగి...

సర్వే అంటూ ఇంటి తలుపుతట్టి..

‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

అల్లుడిని చంపిన మామ

వజ్రాల వాటాలో గొడవ.. అందుకే చంపేశాం

నీళ్ల కోసం ఇంత దారుణమా!

డ్రైయినేజీలో ఆలయ హుండీలు!

వైద్యం అందక చిన్నారి మృతి

బాబాయిపై అబ్బాయి బండరాయితో దాడి!

సినీ నటి డాటా చోరీ

ఒకరి వెంట ఒకరు..

ఆ బస్సు ఎక్కితే అంతే సంగతులు..!

అమ్మ ఊరెళ్లిందని చెప్పడంతో..

ఆర్థిక హత్య.. ఆపై క్షుద్ర డ్రామా!

ఐదేళ్ల కుమారుడిని హత్య చేసిన తల్లి

కిలాడీ ‘యాప్‌’తో జర జాగ్రత్త!

కూలి పనులకు వచ్చి కానరాని లోకాలకు..

చికెన్‌ పకోడా అడిగిందని.. చిన్నారి హత్య

హత్యాయత్నానికి దారి తీసిన విగ్రహ తయారీ

టైర్‌ పేలి లారీని ఢీకొన్న ఇన్నోవాకారు

జైలులో జీవిత ఖైదీ ఆత్మహత్య

విషాదం: లిఫ్ట్‌ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌