అంగన్‌వాడీల ఆందోళన బాట

27 Aug, 2016 22:46 IST|Sakshi
ఆసిఫాబాద్‌ : ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
  •  41 మంది కార్యకర్తల తొలగింపుపై భగ్గుమన్న కార్యకర్తలు
  • జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్‌ కార్యాలయాల ఎదుట ధర్నా 
  •  సీడీపీవోలకు వినతిపత్రాలు 
  •  ఆసిఫాబాద్‌/ముథోల్‌/తాండూర్‌/చెన్నూర్‌ : జిల్లాలోని 41 మంది అంగన్‌వాడీ కార్యకర్తలను అక్రమంగా తొలగిం^è డం..కొందరికి షోకాజు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శనివారం అంగన్‌వాడీలు ఆందోళన బాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఐసీడీఎస్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీడీపీవోలకు వినతిపత్రాలు అందజేశారు. 
    – ఆసిఫాబాద్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు శనివారం స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లూరి లోకేశ్‌ మాట్లాడుతూ గత నెల 22,23 తేదీల్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన బృందాలు వాస్తవ పరిస్థితులు పరిగణలోకి తీసుకోకుండానే కార్యకర్తలపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. కొన్ని కేంద్రాలను విజిట్‌ చేయకుండా డోర్‌లాక్‌ ఉన్న వారిని సైతం టర్మినేట్‌ చేశారన్నారు. అనంతరం సీడీపీవోకు వినతిపత్రం అందజేశారు. కార్యకర్తలు వనిత, సువర్ణ, చంచులక్ష్మి, విజయలక్ష్మి, పుష్పకుమారి పాల్గొన్నారు. 
    – ముథోల్‌ ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రాజెక్టు పరిధిలోని తానూర్, లోకేశ్వరం, కుభీర్, భైంసా, ముథోల్‌ మండలాల కార్యకర్తలు ధర్నా చేశారు. సీఐటీయూ నాయకుడు సుకేంట మహేశ్‌బాబు మాట్లాడుతూ కక్షపూరితంగా కార్యకర్తలను తొలగించడం అన్యాయమన్నారు. ఐసీడీఎస్‌ సీడీపీవో సుగుణకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు వనతి, రేఖ, సవిత్రి, మనీశ ఉన్నారు. 
    – చెన్నూర్‌ సీడీపీవో కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు.  తెలంగాణ వర్కర్స్,హెల్పర్‌ యూనియన్‌ నాయకురాళ్లు రాజమణి ఆధ్వర్యంలో సీడీపీవో మనోరమకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు పద్మావతి, రాజేశ్వరి విజయలక్ష్మి, శారద, సీఐటీయూ నాయకుడు కృష్ణమాచారి పాల్గొన్నారు. 
    – తాండూర్‌ ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు ఆందోళన చేపట్టారు. ప్రాజెక్టు పరిధిలో రెబ్బెన, తాండూర్‌ మండలాలకు చెందిన నలుగురు అంగన్‌వాడీ కార్యకర్తలను విధుల నుంచి తొలగించడం, మరో ఐదుగురికి షోకాజు నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు. సీడీపీవో మమతకు వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా నాయకుడు దాగం రాజారాం, మండల నాయకురాళ్లు సత్యవతి, విజయలక్ష్మి, లీల, పద్మ పాల్గొన్నారు.   అంగన్‌వాడీల కార్యకర్తలు, ధర్నా, anganvadi employees, Darna, Adilabad dist
మరిన్ని వార్తలు