కరువు ప్రాంతానికి ‘భక్తరామదాసు’ వరం | Sakshi
Sakshi News home page

కరువు ప్రాంతానికి ‘భక్తరామదాసు’ వరం

Published Sat, Aug 27 2016 11:00 PM

తిరుమలాయపాలెంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి - Sakshi

  • ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • తిరుమలాయపాలెం:
           కరువుతోపాటు పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న తిరుమలాయపాలెం మండలానికి భక్తరామదాసు సాగునీటి ప్రాజెక్టు ఒక వరమని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని తిరుమలాయపాలెం, చంద్రుతండా, బచ్చోడు గ్రామాల్లో రూ.9 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా తిరుమలాయపాలెంలో సొసైటీ డైరెక్టర్‌ కొండబాల వెంకటేశ్వర్లు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు ప్రాంతంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో వహిస్తున్నారని, త్వరలోనే భక్తరామదాసు ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. తెలంగాణలో గోదావరి జలాలు వృథాగా పోతున్నాయని, ఆ నీటిని తెలంగాణలోని భూముల్లో పారించే సంకల్పంతో కేసీఆర్‌ ఉన్నారని తెలిపారు. ఇటీవల మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని, రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసం విమర్శలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ నాయకుల విమర్శలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ విసిరిన రాజీనామా సవాల్‌ ఆయన చిత్తశుద్ధికి నిదర్శన మన్నారు. ఈ సందర్భంగా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో వ్యవసాయ గోదాముల నిర్మాణంపై స్థానికులు ఎంపీ దృష్టికి తేగా త్వరలోనే గోదాము నిర్మాణం జరిగే విధంగా కృషి చేస్తానని హామి ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పుల అశోక్‌ , తహసీల్దార్‌ వెంకటరెడ్డి, ఎంపీడీఓ సన్యాసయ్య, ఎంపీటీసీ సభ్యురాలు కొలిచలం అనసూర్య, చంద్రుతండా సర్పంచ్‌ బోడ మారు, బచ్చోడు సర్పంచ్‌ పుట్టబంతి రేణుక, ఎంపీటీసీ సభ్యుడు ఎన్నెబోయిన రమేష్, మాజీ ఎంపీటీసీ సభ్యులు రామసహాయం నరేష్‌రెడ్డి, బోడ మంచానాయక్, మాజీ సర్పంచ్‌ కొప్పుల చెన్నకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు
     

Advertisement
Advertisement