జాతీయ బ్యాంకుల్లో నగదు కొరత

12 Dec, 2016 15:14 IST|Sakshi
జాతీయ బ్యాంకుల్లో నగదు కొరత

స్తంభించిన లావాదేవీలు ఖాతాదారుల ఆగ్రహం
నేడు అందుబాటులోకి కొత్త రూ.500 నోట్లు

జాతీయ బ్యాంకుల్లో నగదు కొరత నెలకొంది. దీంతో జిల్లాలోని పలు శాఖల్లో లావాదేవీలు పూర్తిగా స్తంభించారుు. గంటల తరబడి బ్యాంకుల ముందు బారులు తీరిన ఖాతాదారులకు నగదు అందకపోవడంతో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నారుు.  అధికారులను  నిలదీశారు. నగదు లేకుంటే ముందస్తు సమాచారం ఇవ్వాలంటూ మండిపడ్డారు.

తిరుపతి (అలిపిరి): జిల్లా అవసరాలకు తగ్గట్టుగా ఆర్బీఐ నుంచి నగదు అందడం లేదు. దీంతో బ్యాంకు శాఖల్లో తీవ్ర నగదు కొరత ఏర్పడింది. చిత్తూరు, తిరుపతి, మదనపల్లె వంటి ప్రధాన ప్రాంతాల్లోని బ్యాంకు శాఖలకు సకాలంలో నగదు రాలేదు. బుధవారం ఉదయం 10 గంటలకు  బ్యాంకుల వద్దకు చేరుకున్న ఖాతాదారులు మధ్యాహ్నం 2 గంటల వరకు వేచి వున్నా నగదు అందలేదు. దీంతో ఖాతాదారులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగారు. బ్యాంకుల్లో నగదు లేకుంటే ముందస్తు సమాచారం ఇవ్వాలంటూ మండిపడ్డారు. చివరికి చేసేది లేక వెనుదిరగాల్సివచ్చింది.

జిల్లాకు అందిన అరకొర నగదు
జిల్లా అవసరాల రీత్యా రూ.1800 కోట్లు అవసరమైతే ఆర్బీఐ నుంచి రూ.109 కోట్లు మాత్రమే అందారుు. అందులో రూ.9 కోట్లు మాత్రమే రూ.500 నోట్లు  వున్నాయని జిల్లా అధికారులు ప్రకటించారు. బుధవారం కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి రావాల్సి వున్నా.. వాటిని బ్యాంకులకు చేరవేయడానికి ఎక్కవ సమయం పట్టడంతో గురువారం ప్రధాన బ్యాంకు శాఖల్లో కొత్త రూ.500 నోట్లు ఖాతాదారులకు అందుబాటులోకి రానున్నారుు.

ఏటీఎంలలో నో క్యాష్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏటీఎం కేంద్రాలు చాలావరకు పూర్తిస్థారుులో పనిచేయడం లేదు. తిరుపతి నగరంలో తిలక్ రోడ్డు, మదనపల్లెలో ఆర్టీసీ బస్టాండు ప్రాంతం, చిత్తూరులో జిల్లా కలెక్టరేట్‌లోని ఏటీఎంలు మినహా మరే ఇతర ప్రాంతాల్లో పూర్తిస్థారుులో పనిచేయలేదు. పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి, పుంగనూరు వంటి ప్రాంతాల్లో ఏటీఎంలు అడపాదడపా పనిచేసినా నిమిషాల వ్యవధిలో క్యాష్ ఖాళీ కావడంతో ఖాతాదారులు అసహనానికి లోనయ్యారు.

మరిన్ని వార్తలు