గిరిజన ప్రగతికి సేవలందించడం ఆనందంగా ఉంది

27 Jul, 2016 00:33 IST|Sakshi

పాడేరు: గిరిజన ప్రగతి కోసం సేవలందించే సదవకాశం తనకు లభించినందుకు సంతప్తిగా ఉందని ఐటీడీఏ పూర్వ ప్రాజెక్ట్‌ అధికారి ఎం.హరినారాయణన్‌ వెల్లడించారు. జీవీఎంసీ కమిషనర్‌గా బదిలీపై వెళ్తున్న హరినారాయణన్‌కు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కె.సర్వేశ్వరరావుతో పాటు వివిధ శాఖల అధికారులు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ఎన్‌జీవో సంఘం, ఐటీడీఏ ఉద్యోగుల ప్రతినిధులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞాపికలందజేశారు. హరినారాయణన్‌ మాట్లాడుతూ తాను పని చేసిన 18 నెలల కాలం వేగంగా గడిచిపోయిందన్నారు. అధికారులు, సిబ్బంది సహకారంతో గిరిజనుల సంక్షేమం కోసం మంచి సేవలందించగలిగానని చెప్పారు. మన్యం అభివద్ధికి  ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కషి చేయాలని కోరారు. పేద గిరిజనుల్ని ఆదుకుంటే వత్తిలో సంతప్తి ఉంటుందన్నారు. ఇన్‌చార్జి పీవో, సబ్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ మాట్లాడుతూ హరినారాయణన్‌తో కలిసి పని చేసిన అనుభవం తనకు వత్తిపరంగా మార్గదర్శకమన్నారు. ఆయన సలహాలు, సూచనలతోనే మోదకొండమ్మ ఉత్సవాల్ని విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు. వీడ్కోలు పలికిన వారిలో ఐటీడీఏ ఏపీవో కుమార్, డీడీ కమల, ఈఈ కుమార్, డీఈ బీవీఆర్‌ఎం రాజు, వెలుగు ఏపీడీ రత్నాకర్, ఐటీడీఏ మేనేజర్‌ వేగి అప్పారావు, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కుడుముల కాంతారావు, ఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు బుక్కా చిట్టిబాబు, ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు అంబిడి శ్యాంసుందరం, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

 

>
మరిన్ని వార్తలు