సమస్యలు పరిష్కరించాలని గంగపుత్రుల ధర్నా

19 Aug, 2016 17:40 IST|Sakshi
సమస్యలు పరిష్కరించాలని గంగపుత్రుల ధర్నా

రామగుండం : తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని గంగపుత్రులు శుక్రవారం రామగుండం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేప పిల్లలను వేయాలని, అర్హుడైన ప్రతీ గంగపుత్రుడికి చేపల వేటకు లైసెన్సులు జారీ చేయాలని, చేపల వేట నిషేధ సమయంలో లైసెన్సుదారులకు ప్రతీ నెల రూ.9 వేల భృత్యం చెల్లించాలని, గ్రామాల వారీగా మత్స్యకార సొసైటీలు ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేయాలని, ఇటీవల పూడిక తీసిన చెరువులలో చేప పిల్లలను వేసి అదే గ్రామంలోని గంగపుత్రులకు చేపల వేటకు హక్కులు కల్పించాలని, మండల పరిధిలో మూడు చేపల మార్కెట్లతో పాటుగా కోల్డ్‌స్టోరేజీ గోదాం ఏర్పాటు చేయాలని, ఎల్లంపల్లి ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఫిషరీస్‌ పాలిటెక్నిక్‌ స్థాపించి సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని, ఎన్టీపీసీ డ్యాంలో భూనిర్వాసితులకు చేపలు పట్టేందుకు అనుమతించాలని, చేపల వేట సామగ్రిని ప్రభుత్వం  ఉచితంగా అందజేసి కులవృత్తుల పరిరక్షణకు పాటుపడాలని కోరారు.పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావుకు అందజేశారు. ధర్నాలో సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి జితేందర్, గోలివాడ ప్రసన్నకుమార్, నర్సయ్య, పల్లికొండ రాందేవ్, ధర్మాజి శ్రీనివాస్, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు