2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి

7 Sep, 2016 22:06 IST|Sakshi
  • వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సెగ్గం రాజేష్‌
  • కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్టు భూనిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సెగ్గెం రాజేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన మహదేవపూర్‌ మండలం సూరారం గ్రామంలో పర్యటించి భూనిర్వాసితులతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ కింద భూమి పోతుందనే ఆవేదనతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చల్లా స్వరూప, పత్తిపంట నష్టంతో బలవన్మరణం చెందిన యువరైతు ప్రవీన్‌ కుటుంబాలను పరామర్శించారు.
    మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, కన్నెపల్లి పంప్‌హౌస్‌ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు న్యాయమైన పరిహారం కోసం ఏకతాటిపై నిలవాలన్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి సన్నచిన్నకారు రైతులకు సాగునీరందించేందుకు కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే... ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందన్నారు. భూనిర్వాసితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట మల్హర్‌ మండల అద్యక్షుడు సుంకె వెంకటి, నాయకులు కల్యాణ్, కుమార్‌ ఉన్నారు. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా