సమాజహిత సాధకమే ఆధ్యాత్మికత

31 Dec, 2016 22:29 IST|Sakshi
  • ‘మనగుడి–మనసేవ’ కార్యవర్గ ప్రమాణ స్వీకారం
  • రాజమహేంద్రవరం కల్చరల్‌ :
    ‘ఆధ్యాత్మికత అంటే మతం కాదు.. అత్యున్నతమైన నాగరికత, సమాజకల్యాణానికి ఉపకరించే దివ్యసాధన’మని కవి, గాయకుడు ఎర్రాప్రగడ రామకృష్ణ పేర్కొన్నారు. శ్రీమహాలక్షీ్మసమేత చిన్న వేంకన్నబాబు స్వామివారి పీఠం, సర్వేజనాస్సుఖినోభవంతు ఛారిటబుల్‌ ట్రస్టుల అనుబంధ సంస్థ ‘మన గుడి–మన సేవ’ నూతన రాష్ట్ర కార్యవర్గసభ్యులతో ఎర్రాప్రగడ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలికే ప్రతి పలుకూ ప్రార్థన, వేసే ప్రతి అడుగూ తీర్థయాత్ర కావాలన్నారు. పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కార్యవర్గసభ్యులు అంకితభావంతో సేవలందించాలని కోరారు. పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు మాట్లాడుతూ పీఠం ద్వారా వచ్చిన పదవులను బరువుబాధ్యతలుగా కాక భగవంతునితో బంధంగా భావించాలని పిలుపునిచ్చారు. సమాజంలో అశాంతిని దూరం చేసే శక్తి ఆధ్యాత్మికానికే ఉందన్నారు. ఈ ఏడాది దశావతార గోవింద దీక్షలు, గోవిందమాలధారణలు, ద్వారకాతిరుమలకు పాదయాత్రలు, అఖండ నారాయణహరి ఓం మంత్రపారాయణలు భారీస్ధాయిలో నిర్వహిస్తామన్నారు. సామాన్యుని ముంగిటకు ఆధ్యాత్మికవేత్తలు తరలిరావాలని  కోరారు. వివిధ జిల్లాలనుంచి తరలి వచ్చిన 20 మంది కార్యవర్గసభ్యులు, అయిదుగురు గౌరవ సలహాదారులు, ఎనిమిదిమంది మహిళావిభాగం సభ్యులు, 11 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. చైర్‌పర్స¯ŒSగా ప్రమాణస్వీకారం చేసిన దుర్గావేంకట హేమావతి మాట్లాడుతూ ఆధ్యాత్మికత ఇంటి నుంచే ప్రారంభం కావాలని కోరారు. నూతన ఆంగ్ల సంవత్సరాన్ని కాలపురుషుడు చూపుతున్న మేలి మలుపుగా భావించాలన్నారు.  
     
>
మరిన్ని వార్తలు