గర్భిణిపై పోలీసు జులుం

13 Jan, 2017 21:43 IST|Sakshi
  • పోలీస్‌స్టేషన్‌ ఎదుట గ్రామస్తుల బైఠాయింపు 
  • పురుగు మందు తాగిన యువకుడు
  • ఆస్పత్రికి తరలింపు, పరిస్థితి ఉద్రిక్తం 
  • గోకవరం (జగ్గంపేట) : 
    కోడిపందేల అణచివేతకు పోలీసులు అతిగా ప్రవర్తించడంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. మండలంలోని గంగంపాలెంలో శుక్రవారం ఉదయం ఒక ఇంటో కోడిపుంజులు ఉన్నాయని, బెల్టు షాపు నిర్వహిస్తున్నారంటూ వెన్నముద్దల గణపతిని అదుపులోకి తీసుకునేందుకు ఎస్సై వెంకటసురేష్, కానిస్టేబుల్‌ త్రిమూర్తులు ప్రయత్నించారు. ప్రశ్నించిన గణపతి భార్య, గర్భిణి సుబ్బలక్ష్మి మెడపై చేయి వేసి పోలీసులు నెట్టివేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గోకవరం పోలీస్‌స్టేçÙ¯ŒS ఎదుట బైఠాయించారు. ఇదిలా ఉండగా, గ్రామానికి చెందిన యువకుడు సరకణ నాగు పురుగు మందు తాగడంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఇతడిని గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు తదితరులు ఆస్పత్రికి వెళ్లి అతడి పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రథమ చికిత్స అనంతరం అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్, జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు, గంగంపాలెం ఎంపీటీసీ మాజీ సభ్యుడు సాలపు నలమహారాజు, ఎంపీటీసీ దొడ్డి నాగేశ్వరరావు, నాయకులు కర్రి సూరారెడ్డి, మంగరౌతు రామకృష్ణ, కన్నబాబు తదితరులు స్టేష¯ŒS వద్దకు చేరుకుని బాధితులు, పోలీసులతో మాట్లాడారు.  రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా నార్త్‌ జో¯ŒS డీఎస్పీ ఏవీఎల్‌  ప్రసన్నకుమార్, కోరుకొండ సీఐ మధుసూదనరావు స్టేష¯ŒSకు చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. సంఘటనపై విచారణ చేస్తామని, భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు తావేలేకుండా  చూస్తామని వారు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సుమారు మూడు గంటల పాటు ఈ ఆందోళన కొనసాగడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు, ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 
     
మరిన్ని వార్తలు