పుష్కరస్నానానికి వెళ్లి పూజారి మృతి

16 Aug, 2016 01:54 IST|Sakshi
పుష్కరస్నానానికి వెళ్లి పూజారి మృతి
తూడిచెర్ల(జూపాడుబంగ్లా): ఉదయాన్నే పుష్కరస్నానం చేసేందుకు ఎస్సార్బీసీకి వెళ్లిన ఓ పూజారి నీటిలో మునిగి తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటన జూపాడుబంగ్లా మండలం తూడిచెర్ల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పారుమంచాల గ్రామానికి చెందిన చెంచురామయ్య కుమారుడు ఫణీంద్రశర్మ(22) తూడిచెర్ల శంకరమల్లయ్యస్వామి గుడి వద్ద నివాసం ఉంటున్న అవ్వతాతలు లక్ష్మిదేవి, రామ్మూర్తి వద్ద ఉంటూ వేదపారాయణం చేస్తున్నాడు. సోమవారం ఉదయం పుష్కరస్నానం చేసేందుకు గుడికి సమీపంలోని ఎస్సార్బీసీ కాల్వ ర్యాంపులోకి దిగాడు. స్నానం ఆచరిస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి లోతుగా ఉన్న కాల్వలో పడి ఊపిరాడక మరణించాడు. కాల్వలో గాలించినా ఫలితం లేకపోవడంతో వెలుగోడు నుంచి గజఈతగాళ్లను రప్పించి వెతికించగా మతదేహంగా బయటపడ్డాడు. ఘటనా స్థలం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. 
 
మరిన్ని వార్తలు