కరాటేతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది

1 Aug, 2016 00:35 IST|Sakshi
వరంగల్‌ స్పోర్ట్స్‌ : కరాటే నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసంపెంపొందుతుందని డీసీసీబీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి అన్నారు. రియో చిం కాన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో హంట ర్‌ రోడ్‌లోని సీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో ఆదివారం జాతీ య స్థాయి ఓ పెన్‌ టు ఆల్‌ కరాటే పోటీలు నిర్వహించారు. జంగా రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా బాలికలకు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించాల్సిన బాధ్యత పేరెంట్స్‌పై ఉందన్నారు. కాగా, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 500 మంది క్రీడాకారులు పోటీలకు  హాజరయ్యారని టోర్నీ నిర్వాహకæ కార్యదర్శి, గ్రాండ్‌ మాస్టర్‌ ధన్‌రాజ్‌ తె లిపారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఆగ స్టు 26 నుంచి 30 వరకు పాండిచ్చేరిలో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొం టారన్నారు.కార్యక్రమంలో జేఎస్‌ కలైమణి, సాల్మ న్, మహమూద్‌ అలీ, వివేక్‌ పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు