ముగిసిన షటిల్‌ టోర్నమెంట్‌ పోటీలు

1 Jan, 2017 00:24 IST|Sakshi
ముగిసిన షటిల్‌ టోర్నమెంట్‌ పోటీలు
కవిటం (పోడూరు) : స్థానిక శ్రీ చైతన్య షటిల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కర్రి వెంకటరెడ్డి ప్లే గ్రౌండ్‌లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి షటిల్‌ టోర్నమెంట్‌ పోటీలు శనివారం ముగిశాయి. ముగింపు సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నాయకుడు గుంటూరి పెద్దిరాజు అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి చూపించాలని సూచించారు. తణుకుకు చెందిన ప్రముఖ వైద్యుడు కర్రి శ్రీనివాసుల రెడ్డితో కలిసి విజేతలకు నగదు బహుమతులు అందించారు. మాజీ ఉప సర్పంచ్‌ కర్రి శ్రీనివాసరెడ్డి, కర్రి సత్యనారాయణరెడ్డి బ్రదర్స్, పడాల సత్యనారాయణరెడ్డి, చైతన్య షటిల్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు. 
విజేతలు వీరే.. 
మెడలిస్ట్‌ డబుల్స్‌ విభాగంలో రాజమండ్రికి చెందిన అవినాష్, అప్పారావు జోడి విజేతగా నిలిచారు. మెడలిస్ట్‌ సింగిల్స్‌ విభాగంలో రాజమండ్రికి చెందిన అవినాష్‌ విజేతగా నిలిచాడు. నాన్‌ మెడలిస్ట్‌ డబుల్స్‌ విభాగంలో గుడివాడకు చెందిన రాము, ప్రతాప్‌ జోడి విజేతగా నిలిచారు. మెడలిస్ట్‌ సింగిల్స్‌ విభాగంలో వీరవాసరానికి చెందిన శ్రీరామ్‌ రన్నర్‌గా నిలిచాడు. బాలికల డబుల్స్‌ విభాగంలో కవిటంకు చెందిన సాయికుమారి, భావిక జోడి విజేతగా, ఆశా, మౌనిక జోడి రన్నర్‌గా నిలిచారు. ఉత్తమ ప్రతిభా పాటవ ఆటగాడిగా పాలకొల్లుకు చెందిన ఉదయకిరణ్‌ బహుమతి అందుకున్నాడు.  
 
 
 
 
మరిన్ని వార్తలు