నునుపైన వీపు కోసం...

12 Sep, 2016 23:51 IST|Sakshi
నునుపైన వీపు కోసం...

బ్యూటిప్స్
అందం పట్ల అనేక జాగ్రత్తలు తీసుకునే వాళ్లు కూడా వీపును నిర్లక్ష్యం చేస్తారు. వీపు గురించి శ్రద్ధ తగ్గితే క్రమంగా ఆ భాగంలో చర్మం ఛాయతగ్గి నిర్జీవంగా తయారవుతుంది. చలి కాలంలో ఈ చర్మం పొడిబారి తెల్లగా పొట్టు రాలుతుంది. ఇలాంటప్పుడు మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్ రాసి సరిపెట్టుకుంటారు. వీపు కూడా అందంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పని సరి.

స్క్రబ్బర్‌తో: చర్మం మీద మృతకణాలను తొలగించడానికి స్క్రబ్బర్ బాగా పని చేస్తుంది. మార్కెట్‌లో దొరికే రెడీమేడ్ స్క్రబ్ వాడవచ్చు. లేదా ఇంట్లోనే  తయారు చేసుకోవచ్చు.కొంచెం గరుకుగా ఉండే బియ్యప్పిండి, సున్నిపిండితో రుద్దితే మృత కణాలు పోయి చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది. రెడీమేడ్ స్క్రబ్బర్‌లు బ్రాండెడ్‌వే వాడాలి. కొంతమందికి వీపు మీద మొటిమలు, కురుపులు వస్తుంటాయి. ఇలాంటప్పుడు స్క్రబ్బర్ బదులుగా బాడీ బ్రష్ వాడాలి.
 
బ్లీచ్‌తో: సూర్యరశ్మికి ముఖంతోపాటు ఎక్కువగా ఎక్స్ పోజ్ అయ్యేది వీపుభాగమే. డీప్ నెక్, స్ట్రిప్స్ ఉన్న బ్లౌజ్‌లు, చుడీదార్లు వేసుకుంటే ఎండకు వీపు నల్లబడుతుంది. వారానికి ఒకసారి బ్లీచ్ చేయిం చుకుంటే నలుపు పోతుంది. వీపు మీద కమిలిన ప్రదేశమంతా పచ్చిపాలతో రోజూ మసాజ్ చేసుకున్నా కూడా నలుపు వదులుతుంది.

మరిన్ని వార్తలు