మేని బంగారానికి మేలిమి గింజలు

5 Sep, 2013 01:47 IST|Sakshi
మేని బంగారానికి మేలిమి గింజలు

అందానికి ఫేస్‌ప్యాక్‌లు, ఆరోగ్యానికి పండ్లరసాలపైనే దృష్టిపెడతారు చాలామంది.
 వీటితో పాటు పండ్లు, కూరగాయల నుంచి లభించే గింజలను కూడా రోజూ కొంత మోతాదులో తీసుకోవడం అవసరం.
 
 నల్ల నువ్వులు
 నిద్రలేమి, మద్యం సేవించడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలకు నల్లనువ్వులు చక్కని పరిష్కారం. నువ్వులలో ఉండే కొవ్వు, అమినోయాసిడ్స్, పొటాషియం, పీచుపదార్థాలు చర్మానికి మేలు చేస్తాయి. చర్మం సాగే గుణాన్ని నివారిస్తాయి.
 
 ఇలా చేయండి:
 నువ్వులను పచ్చిగా లేదా వేయించి పండ్లు, కూరగాయల సలాడ్స్‌లో కలిపి తీసుకోవచ్చు.
 
 గుమ్మడి గింజలు
 జింక్, విటమిన్ ఇ, సల్ఫర్, ఒమెగా 3 నూనెలలో ఉండే సహజగుణాల వల్ల చర్మం నిస్తేజంగా మారదు. పైగా తనను తాను రిపేర్ చేసుకుంటుంది. గుమ్మడి గింజల్లో వేడి చేసే గుణం ఉండటం వల్ల కొవ్వు కరుగుతుంది.
 
 ఇలా చేయండి:
 గుమ్మడి గింజలను పచ్చిగానే తీసుకోవచ్చు లేదా గింజలను గ్రైండ్‌చేసి, సలాడ్స్‌లో కలిపి తీసుకోవచ్చు.
 
 దోస గింజలు:
 చాతిలో మంట తగ్గించడం, కిడ్నీల పనితీరును, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచే గుణాలు వీటిలో ఉన్నాయి. ఎ, బి, సి విటమిన్లు ఉండటం వల్ల శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే పోషకాలు శిరోజాలకు, గోర్లకు బలాన్ని ఇస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా చర్మం నిగారింపు పెరుగుతుంది.
 
 ఇలా చేయండి:

 రోజూ సలాడ్‌లో టీ స్పూన్ వేయించిన దోస గింజలను కలిపి తీసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం. అందానికి అందం.
 

మరిన్ని వార్తలు