ఏ టైపు వ్యాయామం గుండెకు మంచిది!

21 Nov, 2018 01:10 IST|Sakshi

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అని అందరికీ తెలుసు. అయితే ఏ రకమైన వ్యాయామంతో ఏ లబ్ధి చేకూరుతుందన్న విషయంలో మాత్రం స్పష్టత తక్కువే.  వాకింగ్, సైక్లింగ్‌ వంటి వ్యాయామాలతో పోలిస్తే.. శక్తి కోసం చేసే వ్యాయామాలు (బరువులెత్తడం వంటివి) గుండెకు ఎక్కువ మేలు చేస్తాయని అంటున్నారు అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ శాస్త్రవేత్తలు. ఇటీవల పెరూలో జరిగిన ఒక సదస్సులో వీరు తమ అధ్యయనం తాలూకూ వివరాలను ప్రకటించారు.

అన్ని రకాలా వ్యాయామాలూ గుండెకు మేలు చేసేవే అయినప్పటికీ బరువులెత్తడం వంటి స్థిరంగా ఉంటూ చేసేవాటి వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తగ్గడమే కాకుండా చికిత్సగా కూడా ఉపయోగపడుతుందని వీరు అంటున్నారు. సుమారు నాలుగు వేల మంది అమెరికన్లపై ఏడాదిపాటు జరిపిన అధ్యయనం ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చామని రెండు రకాల వ్యాయామం చేసే వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 70 శాతం తక్కువని కూర్చుని చేసే ఎక్సర్‌సైజుల వల్ల ఫలితం బాగా ఉన్నట్లు తెలిసిందని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త మియా పి.స్మిత్‌ తెలిపారు 

మరిన్ని వార్తలు