'ఏపీలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ దుర్వినియోగం'

11 Jul, 2015 14:12 IST|Sakshi

హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను దుర్వినియోగం చేస్తోందని ఏపీసీసీ నేత గౌతమ్ ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. శనివారం హైదరాబాద్లో ఏపీసీసీ నేత గౌతమ్ మాట్లాడుతూ... ప్రభుత్వం చేసిన తప్పులను టార్గెట్ చేసినప్పుడు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీని వాడుకోవడానికి ఆదేశాలు ఇచ్చినట్లుగా ఉందని విమర్శించారు.

ఎమ్మెల్యే చింతమనేనిని రక్షించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చారన్నారు. రెవెన్యూ ఉద్యోగులను చంద్రబాబు బెదిరించి రాజీకి వచ్చేలా చేశారని గౌతమ్ తెలిపారు. రాష్ట్రంలో ఇసుక దోపిడి జరుగుతుందనడానికి చింతమనేని ఉదంతమే నిదర్శనమన్నారు. ఇసుకను మహిళా సంఘాలకు అప్పగించామని చంద్రబాబు చెప్పారు... కానీ ఇసుకరేవు వద్ద టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి ఏం పనో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.
 

మరిన్ని వార్తలు