దర్యాప్తు అకస్మాత్తుగా ఆగిపోయింది

8 Nov, 2016 02:57 IST|Sakshi
దర్యాప్తు అకస్మాత్తుగా ఆగిపోయింది

- హైకోర్టుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది సుధాకర్‌రెడ్డి వెల్లడి
- అందుకే ఓటుకు కోట్లు కేసులో ప్రత్యేక కోర్టును ఆశ్రరుుంచాం
 
 సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో సక్రమంగా సాగుతూ వచ్చిన దర్యాప్తు అకస్మాత్తుగా ఆగిపోరుుందని, ఈ నేపథ్యంలోనే తాము ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. తమ ఫిర్యాదుపై స్పందించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు కేవలం దర్యాప్తునకు మాత్రమే ఆదేశించిందని, దానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రరుుంచి స్టే పొందారని తెలిపారు. ఓటుకు కోట్లు కేసుతో తనకేమీ సంబంధం లేదని చంద్రబాబు చెబుతున్నారని, అలాంటప్పుడు ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు దర్యాప్తు పూర్తి నివేదికను సమర్పించేంత వరకు ఆయన వేచి చూడాల్సిందన్నారు. ఆ దర్యాప్తులో చంద్రబాబు 24 క్యారెట్ల బంగారంలా బయటకు వచ్చే వారేమోనని, హైకోర్టును ఆశ్రరుుంచడం వల్ల ఆయన ఈ బంగారు అవకాశాన్ని కోల్పోయారని సుధాకర్‌రెడ్డి వివరించారు. ఓటుకు కోట్లు కేసులో ఫిర్యాదుదారు (ఆళ్ల రామకృష్ణారెడ్డి)ను థర్డ్ పార్టీ అని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అర్హత అతనికి లేదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పదేపదే వాదిస్తున్నారని, వాస్తవానికి చంద్రబాబుకే ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హత లేదని ఆయన తెలిపారు.

ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం దీనిపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రరుుంచారు. విచారణ జరిపిన హైకోర్టు, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపివేస్తూ గత నెల 2న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రరుుంచారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలంటూ హైకోర్టును ఆదేశించింది.  చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి విచారణ మొదలుపెట్టారు. గతవారం చంద్ర బాబు తరఫున సిద్దార్థ్ లూత్రా వాదనలు ముగించడంతో సోమవారం సుధాకర్‌రెడ్డి వాదనలు ప్రారంభించారు.

 బాబు స్వర నమూనాల జోలికెళ్లడం లేదు
 ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో 22 సార్లు చంద్రబాబు ప్రస్తావన వచ్చిందని, అరుుతే ఆయన పాత్రపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయడం లేదని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మొదట్లో దర్యాప్తును వేగంగా ప్రారంభించిన ఏసీబీ అధికారులు తరువాత కీలక దర్యాప్తును పక్కన పెట్టేశారన్నారు. వారు చంద్రబాబు స్వర నమూనాల జోలికి వెళ్లలేదని  నివేదించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రరుుంచారని, ఇది సరైన విధానం కాదన్నారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై భయాందోళనల ఆధారంగా చంద్రబాబు హైకోర్టును ఆశ్రరుుంచారని చెప్పారు. ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలో భయాందోళనల ఆధారంగా ఓ వ్యక్తి దాఖలు చేసే పిటిషన్‌ను విచారించడానికి వీల్లేదని కూడా సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు.

ఈ కేసులో చంద్రబాబు నిందితుడు కాదని, అలాంటప్పుడు ఆయన హైకోర్టును ఆశ్రరుుంచడానికి వీల్లేదని సుధాకర్‌రెడ్డి అన్నారు. ఏసీబీ అధికారులు చంద్రబాబును నిందితునిగా చేర్చలేదన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి స్పందిస్తూ... మీరు చంద్రబాబును నిందితునిగా మీ ఫిర్యాదులో పేర్కొన్నారు.. మరోవైపు నిందితుడు కాదని చెబుతున్నారు.. ఎందుకీ పరస్పర విరుద్ధమైన వాదనలు అని ప్రశ్నించారు. చంద్రబాబు నిందితుడు కాదని, కాబోయే నిందితుడని (ప్రాస్పెక్టివ్ అక్యూజ్డ్) సుధాకర్‌రెడ్డి తెలిపారు. ప్రాస్పెక్టివ్ అక్యూజ్డ్ అన్న ఉద్దేశంతోనే తాము ఫిర్యాదులో నిందితునిగా పేర్కొన్నామని, ఇది ప్రతీ పిటిషన్‌లోనూ జరిగే ప్రక్రియేనని వివరించారు. కోర్టు పనివేళలు ముగియడంతో తదుపరి విచారణ మంగళవారానికి వారుుదా పడింది.

మరిన్ని వార్తలు