'కాల్మనీ కేసుపై అసెంబ్లీలో చర్చిస్తాం'

16 Dec, 2015 13:26 IST|Sakshi

హైదరాబాద్: ప్రజలను పీడించి, వేధింపులకు గురిచేసిన కాల్ మనీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ చెప్పారు.  వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లోటస్పాండ్లో బుధవారం వైఎస్ఆర్ సీఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశానంతరం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి జ్యోతుల నెహ్రూ, పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు. ఏం చెప్పారంటే..

  • కాల్ మనీ కేసుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తాం
  • నిరుద్యోగ సమస్యలను, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
  • వీఆర్ఏ, అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యలను ప్రస్తావిస్తాం
  • విచ్చలవిడి కల్తీమద్యం అమ్మకాలు, అమాయకులు చనిపోయిన ఘటనపై చర్చిస్తాం
  • ఏపీలో మద్యపాన నిషేధం కోసం డిమాండ్ చేస్తాం
  • గిరిజనుల మనుగడుకు నష్టం వాటిల్లేలా ఉన్న బాక్సైట్ విధానాన్ని మార్చాలి
  • రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తాం
  • ఆకాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలి
  • ప్రజా సమస్యలన్నింటీపై చర్చ జరిగి పరిష్కారం చూపేంతవరకు అసెంబ్లీ సమావేశాలు జరగాలి
  • శాసనమండలిలోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తాం

మరిన్ని వార్తలు