హుస్సేన్‌సాగర్‌లో ఆత్మహత్యకు యత్నం..రక్షించిన పోలీసులు

12 Feb, 2015 19:50 IST|Sakshi

హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో దూకిన ఇద్దరు మహిళలను పోలీసులు రక్షించారు. నగరంలోని చార్మినార్‌కు చెందిన మహబూబున్నిసా, బన్సిలాల్‌పేట్‌కు చెందిన రేణుక గురువారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. వివరాలు... బన్సిలాల్‌పేటకు చెందిన రేణుకకు జగదీష్ బాబు అనే వ్యక్తితో 2000 సంవత్సరంలో పెళై్లంది. వారికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మొదటి భార్య రేణుకను మానసికంగా వేదిస్తుండటంతో పాటు చంపేస్తానని బెదిరిస్తుండటంతో డిప్రెషన్‌కు లోనై హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకొడానికి ప్రయత్నించింది. చార్మినార్‌కు చెందిన మహబూబ్‌ఉన్నిసాకు బిహార్‌కు చెందిన వాజిద్‌అలితో 2011 లో వివాహమైంది. వారికి రెండేళ్ల కుమార్తె ఉంది. పెళై్లనప్పటినుంచి భ ర్త తన స్వస్థలం బిహార్‌కు రమ్మని ప్రతిరోజు వేదిస్తున్నాడు. తనకు చెప్పకుండా వాజిద్ తన కుమార్తెను బిహార్‌కు తీసుకువెళ్లడంతో డిప్రెషన్‌కు లోనైన మహబూబున్నిసా ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించింది. ఈ విషయం గమనించిన లేక్ పోలీసులు వారిని కాపాడి కౌన్సిలంగ్ ఇచ్చి గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు