ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

16 Apr, 2016 10:25 IST|Sakshi
ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

అందంతోపాటూ అణుకువగా ఉన్నట్టు కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. అసలు ఆమె అమ్మాయే కాదు...ఇంకా చెప్పాలంటే అసలు మనిషే కాదు. చైనాలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో తయారు చేసిన రోబో. చైనా సొంత  టెక్నాలజీతో మనిషిని తలపించేలా తయారు చేసిన రోబో ఇది.
 
ఈ రోబో అందంగా ఉండటమే కాదు.. మనుషులతో ఎంచక్కా మాట్లాడటం కూడా తెలుసు. యూనివర్సిటీకి చెందిన ఐదుగురు అందమైన అమ్మాయిలను ఎంచుకొని వారి ఫీచర్లతో ఈ రోబోను తయారు చేశారు. దీనికి జియా జియా అని నామకరణం కూడా చేశారు. ఫేస్ ఎక్స్ ప్రెషన్స్, సంభాషించడం, హావభావాలు పలికించడంలాంటివి కూడా ఈ రోబో చేయగలుగుతుంది. ఇలాంటి రోబోలు తయారు చేయడం చైనాలో ప్రథమమని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.


 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు