నిధుల దుర్వినియోగం : 8వేల మందిపై చర్యలు

23 Dec, 2017 19:37 IST|Sakshi

బీజింగ్‌ : అవినీతి నిర్మూలనే ధ్యేయంగా అధి​కారంలోకి వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ తన హామీని నిలబెట్టుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. 2016కు చెందిన ప్రభుత్వ బడ్జెట్‌లో అవకతవకలకు పాల్పడిన 8వేల మందికి పైగా ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్టు చైనా అధికారిక పత్రిక జిన్హువా వెల్లడించింది. జాతీయ ఆడిట్ కార్యాలయం అధిపతి అయిన హు జ్యూన్ వీరి ఉల్లంఘనలను బహిర్గతం చేశారు. పేదరిక నిర్మూలన పథకం కోసం కేటాయించిన నిధులను దుర్వినియోగపరిచిన కేసులో 970మందిపై, నిధుల మంజూరులో అక్రమాలకు పాల్పడినందుకు 1363మందిపై చర్యలు తీసుకున్నట్టు జ్యూన్ వెల్లడించారు.

నిధులను ఉల్లంఘించిన వారిలో  ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వారు 800 మంది ఉండగా.. ఎనిమిది దిగ్గజ బ్యాంకులకు చెందిన వారు 73 మంది ఉన్నట్టు జ్యూన్‌ పేర్కొన్నారు. అదేవిధంగా మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ఫండ్స్‌లో దుర్వినియోగానికి పాల్పడిన 505 మందిపై కూడా ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏడాది పైగా కావొస్తున్నా.. అఫార్డబుల్‌ హౌసింగ్‌ ప్రాజెక్టులకు చెందిన 48 బిలియన్‌ యువాన్ల ఫండ్స్‌ను వాడలేదని జ్యూ పేర్కొన్నారు. దుర్వినియోగం చేసిన 1.37బిలియన్‌ యువాన్లను తిరిగి రాబట్టినట్లు తెలిపారు. అయితే వీరికి ఎలాంటి శిక్షలు విధించారో తెలుపలేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 15లక్షల మంది ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపినట్టు తెలిసింది. 

మరిన్ని వార్తలు