మా అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని కాపాడుకుంటాం

11 Aug, 2018 04:31 IST|Sakshi
ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి యోంగ్‌ హో

టెహ్రాన్‌: అణ్వస్త్రాలను త్యజిస్తామని ఉత్తర కొరియా అమెరికాకు మాట ఇచ్చినప్పటికీ, తమ అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని భద్రంగా కాపాడుకుంటామని ఆ దేశ విదేశాంగ మంత్రి యోంగ్‌ హో అన్నారు. ప్రస్తుతం ఇరాన్‌ పర్యటనలో ఉన్న ఆయన.. ‘ఉత్తర కొరియాతో శత్రుత్వానికి అమెరికన్లు అంతం పలకరని మాకు తెలుసు. అందుకే మా అణ్వాయుధ పరిజ్ఞానాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని భద్రపరచుకుంటాం’ అని అన్నట్లు ఇరాన్‌ వార్తా సంస్థ మెహ్ర్‌ వెల్లడించింది. ఇటీవల భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌లు కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు ఒప్పందం చేసుకోవడం తెల్సిందే. అణ్వాయుధాలకు సంబంధించి 2015లో ఇరాన్‌తో ఆరు దేశాలు కలిసి చేసుకున్న ఒప్పందం నుంచి తాజాగా అమెరికా వైదొలిగి, ఇరాన్‌పై పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యమేర్పడింది.

మరిన్ని వార్తలు