భీకర దావానలం

21 Oct, 2015 11:39 IST|Sakshi
భీకర దావానలం

జకార్తా: ఇండోనేషియా అటవీ ప్రాంతంలో   చెలరేగిన దావానలం ఆ  దేశాన్ని కుదిపేస్తోంది.  సుమత్రా, బోర్నియో ద్వీపాల్లో ప్రారంభమైన  మంటలు  సెలెబెస్, మలుకు, పపువా ద్వీపాలకు మరింత విస్తరించాయి.  భారీ  ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడుతూ పచ్చని  పైర్లను, అడవులను  బూడిదగా మార్చేస్తున్నాయి. అంతకంతకు వ్యాప్తి చెందుతున్న మంటలను ఆర్పేందుకు  సహాయక దళాలు, ప్రభుత్వ యంత్రాంగం  తీవ్రంగా శ్రమిస్తున్నాయి.


శాటిలైట్ సమాచారం ప్రకారం మంగళవారం 1,545గా ఉన్న అగ్నికీలలు  మరిన్ని  ప్రదేశాలకు   విస్తరిస్తున్నాయి. ఈ మంటలు అంతకంతకు రెట్టింపయ్యి బుధవారం నాటికి  3,226గా తేలాయి. వ్యాపిస్తున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకుగాను ఇండోనేషియా ప్రభుత్వం  ఇతర దేశాలను సహాయాన్ని అర్ధిస్తోంది. ప్రధానంగా రష్యా, కెనడా, ఆస్ట్రేలియాలతో పాటు ఇతర దేశాలను ఎయిర్‌ క్రాఫ్ట్స్ తదితర  సామాగ్రిని పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. కాగా దేశ చరిత్రలోనే ఇది అతి  భారీ అగ్ని ప్రమాదమని ఇండోనేషియా అధికారిక వర్గాలు బుధవారం ప్రకటించాయి.  మంటలను అదుపుచేసుందుకు  ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా కృషి  చేస్తోందని తెలిపాయి.

మరిన్ని వార్తలు