‘ఆడవారిని వేధించవచ్చని అధ్యక్షుడే చెప్పాడు’

23 Oct, 2018 20:31 IST|Sakshi

వాషింగ్టన్‌ : ఎన్ని చట్టాలు, ఉద్యమాలు వచ్చినా ఆడవాళ్ల పట్ల జరిగే వేధింపులకు, అత్యచారాలకు అంతమంటూ ఉండదనిపిస్తోంది. ఓ వైపు మహిళా లోకమంతా తమ పట్ల జరిగే వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతుంటే మరోపక్క మృగాళ్లు కూడా అదే రీతిలో రెచ్చిపోతున్నారు. ఇన్ని దరిద్రాల మధ్య ఇలాంటి పనులు చేసిన నీచులను మన నాయకులు వెనకేసుకురావడం మరీ దరిద్రం. ఇది ఒక్క మన దేశంలో పరిస్థితి మాత్రమే కాదు. అగ్ర రాజ్యం అమెరికాలో కూడా ఇదే దుస్థితి. మహిళను వేధించడమే తప్పంటే..  మహిళల వ్యక్తిగత శరీర భాగాలను తాకడం తప్పు కాదని మా అధ్యక్షుడే చెప్పాడంటూ వితండవాదం ప్రారంభించాడు ఓ ప్రబుద్ధుడు.

వివరాలు బ్రూస్ మైఖేల్ అలెగ్జాండర్(49) అనే ప్రయాణికుడు విమానంలో తనతో పాటు ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు మైఖేల్‌ను అరెస్ట్‌ చేశారు. అయితే మైఖేల్‌ తన తప్పును ఒప్పుకోకపోవడమే కాకా.. ‘ఆడవారి వ్యక్తిగత శరీర భాగాలను తాకడం తప్పు కాదని అమెరికా అధ్యక్షుడే చెప్పాడు’ అంటూ పోలీసులతో వాదించడం ‍ప్రారంభించాడు. అయితే కోర్టు, పోలీసులు మైఖేల్‌ వాదనను పట్టించుకోలేదు. అతను చేసిన తప్పుకు రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు 2, 50, 000 అమెరికన్‌ డాలర్ల(ఇండియన్‌ కరెన్సీలో 1,83,93,200) జరిమాన కూడా విధించింది.

మరిన్ని వార్తలు