'గే' లపై కామెంట్స్తో కాంట్రాక్ట్ పోయే..

18 Feb, 2016 18:00 IST|Sakshi
'గే' లపై కామెంట్స్తో కాంట్రాక్ట్ పోయే..

మనీలా: స్వలింగ సంపర్కులు జంతువుల కన్నా నీచం అని వ్యాఖ్యానించి తరువాత క్షమాపణలు చెప్పిన ఫిలిప్పీన్స్ బాక్సర్ ఫకియావ్తో తమ కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్లు ప్రముఖ స్పోర్ట్స్ వేర్ కంపెనీ నైక్ ప్రకటించింది. పకియావ్ చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని, ఇలాంటి వివక్ష పూరిత వ్యాఖ్యలను తమ సంస్థ ఏ మాత్రం సహించబోదని నైక్ ఓ ప్రకటనను విడుదల చేసింది. లింగవివక్ష ఎదుర్కొంటున్న కమ్యూనిటీకి తమ సంస్థ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని ఆ ప్రకటనలో వెల్లడించింది.

ఆరు సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచిన పకియావ్ ఓ టీవీ ఇంటర్వూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. తరువాత బైబిల్ చెబుతున్న విషయాన్నే నేను చెబుతున్నానని సమర్థించుకున్నా ఆయనపై విమర్శల పర్వం ఆగలేదు. ప్రస్తుతం పకియావ్ ఫిలిప్పీన్స్లో సెనేటర్ స్థానం కోసం పోటీలో ఉన్నాడు.
 

మరిన్ని వార్తలు