మంత్రి ఆదిత్య ఠాక్రేకు ధన్యవాదాలు: విద్యార్థులు

13 Jul, 2020 14:33 IST|Sakshi

ముంబై: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రష్యాలో చిక్కుకున్న 480 మంది భారతీయ వైద్య విద్యార్థులు సోమవారం ఓ ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో ముంబై చేరుకున్నారు. వారిని భారత్‌కు తీసుకువచ్చేందుకు సాయం చేసిన మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శివసేనకు చెందిన ముంబై-సౌత్ ఎంపీ అర్వింద్‌ సావంత్ మీడియాతో మాట్లాడుతూ.. రష్యాలో ఉన్న భారత విద్యార్థులు మొదట తనను సంప్రదించారని, దీంతో వారికి మంత్రి ఆదిత్య ఠాక్రేకు ట్వీట్‌ చేయమని సలహా ఇచ్చానని చెప్పారు. ఇక ఆయన క్యాబినెట్‌ మంత్రిగా ఉన్నందున ప్రోటోకాల్‌ విభాగానికి బాధ్యత వహించి విద్యార్థులను భారత్‌కు రప్పించారని సావంత్‌ తెలిపారు. ​(చదవండి: మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు)

మహరాష్ట్ర చేరుకున్న 480 విద్యార్థుల్లో 470 మంది మహరాష్ట్ర చేరుకున్నారని, దాద్రా, నగర్‌ హవేలీకి చెందిన వారు 4, మధ్యప్రదేశ్‌కు చెందిన వారు 4, గోవాకు చెందిన ఇద్దరూ ఉన్నారు. రష్యా నుంచి విద్యార్థులను తీసుకువచ్చేందుకు ప్రతి విద్యార్థికి 400 డాలర్లు (సుమారు రూ. 30,000) ప్రభుత్వం చెల్లించినట్లు నిక్స్టోర్ విమాన ఆన్‌లైన్ టికెటింగ్ కంపెనీకి చెందిన నికేష్ రంజన్ తెలిపారు. విద్యార్థులను తీసుకువచ్చేందుకు ఠాక్రే సహాయం చేశారని, ఇందుకు ఆయన  విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ), రాష్ట్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయాలను సంప్రదించారని రంజన్‌ పేర్కొన్నారు. (చదవండి: గుడ్‌న్యూస్‌: కరోనా డ్రగ్‌ ధర తగ్గింది)

మరిన్ని వార్తలు