రాజధానిలో మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ర్యాలీ

27 Jun, 2013 02:22 IST|Sakshi
రాజధానిలో మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ర్యాలీ

మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యం పై, సమాజంపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలిపేందుకు నగర పౌరులు, సైనికులు బుధవారం కదం తొక్కారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా నిర్వహించిన మార్చ్‌లో నగరవాసులతోపాటు సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్, తీరరక్షక దళం, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్, ఎన్‌సీసీ, మాదకద్రవ్యాల నియంత్రణ విభాగానికి చెందిన 3,500 జవాన్లు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యా, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కిరణ్ వాలి యా జెండా ఊపి ఈ మార్చ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుబడి ఉందన్నారు.
 
 ఇప్పటికే ఇందుకోసం ఎన్నో చర్యలను తీసుకున్నామని చెప్పారు. మాదకద్రవ్యాలకు బాని సైనవారిని మామూలు మనుషులుగా చేసేందుకు డీటాక్స్ సెంటర్లను, డీ అడిక్షన్ ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేకాక నగరంలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నా రు. మాదకద్రవ్యాల వినియోగంపై నగరవాసుల్లో మరింత అవగాహన కల్పించేందుకు రాజ్యాంగబద్ధమైన ప్రత్యేక ఉద్యోగులను నియమించేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నామన్నారు. వీరు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పిస్తారని వాలియా చెప్పారు. ఈ సందర్భంగా చేసిన ప్రతిజ్ఞలో ఆమె కూడా పాల్గొన్నారు. అనంతరం మార్చ్‌లో పాల్గొన్నవారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఇండియాగేట్ నుంచి బయలుదేరారు. నినాదాలు చేస్తూ నగరవాసుల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు.
 

మరిన్ని వార్తలు